Books

Home - Books

ఇదిమా తోలిప్రయత్నం, ఇప్పటి వరకు కొన్నివేల మంది అర్చకులకు
అర్చకేతరులకు ఈ దివ్యగ్రంధము అందించబడింది. అందరూ నచ్చిన, మెచ్చిన
ప్రసంగ సముదాయం ప్రసంగ కుసుమాలు ముచ్చటైన ముఖచిత్రంతో ముస్తాబై మీముందు సాక్షాత్కరిస్తుంది

ప్రసంగ కుసుమాలు-1

మా పూతోటలో పుష్పించిన కుసుమం, ప్రసంగ కుసుమాలు ద్వితీయభాగం.ప్రసంగ కుసుమాలు ప్రధమ బాగానికిది ఒకతోబుట్టువు. ధ్యానకూటాలలో ..ఆరాధనలలో వినియోగించుకొనుటకు అనుకూలమైన సంక్లిప్త సందేశాలు.ఇప్పటికినాలుగు పర్యాయములు ఈ గ్రంథమును ప్రచురించాము.

ప్రసంగ కుసుమాలు 2

ప్రార్ధనా సమావేశాలు జరిగించిన ప్రతీసారి ప్రభువునేర్పిన ప్రార్థన చెప్పుకుంటాము. ఈ ప్రార్ధన చెప్పకూడదని కొందరు, చెప్పొచ్చని మరికొందరు, వాదిస్తుంటారు.ఇది ప్రభువు నేర్పిన ప్రార్ధనపై వ్రాసిన ప్రశస్తగ్రంధం

పభువు నేర్పిన ప్రార్థన

పేరులోనే దీనిభావం కనిపిస్తుంది. ఆంగ్లంలో “పెటల్స్” అంటాము. ఒక్కొక్కవిషయంపై ఏడేడువిషయాలు… బోధకులకు ఉపయోగపడే విధంగా ప్రసంగాలకు తోడ్పడే అంశాలలో కూడిన పుస్తకం. పుల్పిట్హెల్ప్స్” అనికూడా దీనిని సంబోధించవచ్చు.ఇది మేము ప్రచురించి ననాల్గవగ్రంధం.

ప్రసంగ పురేకులు

సిలువ ప్రాంగణంలో మూడు అనుసంఖ్య గొప్ప విలువలను సంతరించుకొంది. వేరే సంఖ్యలకు ఇంత ప్రాముఖ్యత లేదు. మూడును
ఆధారం చేసికొని వ్రాసిన చిరుపుస్తకం. “సిలువతో ముడిపడిన మూడు”

సిలువతో ముడిపడిన మూడు

క్రిస్మస్ మహా పండుగ. ఇది క్రీస్తు జయంతి. క్రిస్మస్ గూర్చి తెలియని వారుండరు. చాల సంవత్సరాల నుండి పాఠకులకు పరిచయమైన సందేశాలు ఇందులో పొందుపరిచాము.

క్రిస్మస్ సందేశాలు

బైబిల్ ఆరంభం నుండి ముగింపు వరకు ఎక్కడెక్కడ సిలువ ప్రస్తావించబడిందో ఆవిషయాలన్నీ ఈ పుస్తకంలో రాశాము. ఇది సిలువను గూర్చిన విశేష పరిశోధన. సిలువను గూర్చి అధ్యయనం చేసి ఆశీర్వాదం పొందామని అనేకులు సాక్ష్యమిచ్చారు. దేవునికిస్తోత్రము

కల్వరి కుసుమాలు

పరిశుద్ధాత్మను గూర్చి భిన్నాభిప్రాయాలు క్రైస్తవ సంఘంలో చోటుచేసికొన్నాయి. పరిశుద్ధాత్ముడు దేవుడనే విషయం చాలామందికి తెలియదు. త్రిత్వమును గూర్చి తెలియని వారు మరికొందరు. పరిశుద్ధాత్ముడు దైవిక వ్యక్తి అన్న సత్యం ఇందులో రాయడం జరిగింది.

పరిశుద్ధాత్మ దేవుడు

ప్రసంగ పరిమళాలు

బైబిల్ గ్రంధంలో పేరులేని శ్రీమతులు చాలామంది ఉన్నారు. అలాంటి 21 మంది శ్రీమతుల జీవిత విశేషాలు ఈ గ్రంధంలో పొందిపరచడం జరిగింది. శ్రీమతులకు ఇదొక బహుమతి.

పేరులేని శ్రీమతులు

సంకీర్తనలు